ఆడపిల్లకి ఒడిబియ్యం పోస్తారెందుకు?

అత్తింట్లో ఎన్ని అదృష్టాలున్నా, భర్త ఎంత ప్రేమగా చూసుకున్నా పుట్టింటి మీద మమకారం ఆడపిల్లకి ఉంటుంది. ఆడపిల్ల చీరలూ, నగలూ, ధనమూ, దీవెనలూ, ప్రేమా కోరుకుంటుంది. అందుకే మంగళకరమైనవన్నీ ఇచ్చి పంపించడమే ఒడిబియ్యం పరమార్ధము. ఒకరకంగా ఈ ఆచారం వల్ల పెళ్లి చేసిన పిల్లను మర్చిపోకుండా నిర్లక్ష్యం చెయ్యకుండా అత్తింటినుంచి పుట్టింటికి తెచ్చి పిల్లకి ఆనందం కలుగచేస్తారని ఈ ఆచారాన్ని పెద్దలు పెట్టారు.

Leave a comment