ఎలాంటి లక్షణాల గల స్త్రీ తనకు తాను సుఖపడుతుంది?

పొడవుగా ఉన్న క్రింద పెదవి స్త్రీలకు భోగాన్నిస్తుంది. పై పెదవి తీక్షణముగానున్నా కోపిష్టి స్త్రీ అవుతుంది. సంఖమువలే, మల్లెపూవు వలే, చంద్రుని వంటి తెల్లని పలువరుసతో నునుపుగా, పొడవుగా సందులు లేకుండా ఎత్తుగా ఉన్న దంతములుగల స్త్రీ మృష్టాన్న పానములు అధికంగా పొందుతుంది. మిక్కిలి పొడవూ, మిక్కిలి ఎత్తుగా కాక సమముగా నున్న ముక్కుగల స్త్రీ ధన్యురాలు. భర్త ద్వారా శారీరక సుఖాన్ని అధికంగా పొందుతుంది. ఒక దానితో నొకటి కలయిక ముఖములో కూర్చుండ బెట్టిబట్టున్న సూక్ష్మమైన కనుబొమ్మలు గల స్త్రీ సుఖవంతురాలవుతుంది. కాటుక పిట్ట, లేడి, వరాహము వంటి కనులున్న స్త్రీ ఎంత లేన ఇంట పుట్టినా మహావైభోగాలను అందుకుంటుంది. భర్త అరచేతిలో పెట్టుకొని చూసుకుంటాడు.

Leave a comment